ఇన్‌స్టాలో..వీటిదే హవా!

ఓ కుర్రాడి ఇన్నర్‌ ఫీలింగ్స్‌ తెలియాలంటే.. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిస్తే చాలంటారు! బరిగీసి మరీ ‘బయో’లో ఉన్నదంతా చెప్పేస్తాడు. అలాగే ఓ పడుచుపిల్ల పోస్టుపై కన్నేస్తే.. తన కథంతా అర్థమవుతుంది.

Published : 20 Apr 2024 00:02 IST

ఓ కుర్రాడి ఇన్నర్‌ ఫీలింగ్స్‌ తెలియాలంటే.. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిస్తే చాలంటారు! బరిగీసి మరీ ‘బయో’లో ఉన్నదంతా చెప్పేస్తాడు. అలాగే ఓ పడుచుపిల్ల పోస్టుపై కన్నేస్తే.. తన కథంతా అర్థమవుతుంది. తమ భావాలతో ఎవరెలా ఇన్‌స్టాని ముంచెత్తినా.. ఇదిగో ఈ కోట్స్‌ మాత్రం యువత మనసుని బాగా హత్తుకుంటున్నాయి.

  • సాహసం నాకోసం ఎదురుచూస్తోంది.. దాని చేయందుకోవడానికి నేను సిద్ధం.
  • ఇప్పుడు చెమట్లు చిందిస్తే.. తర్వాత మేని మెరుపులన్నీ నీవే!
  • ఆత్మవిశ్వాసం.. ఇంతకుమించిన గొప్ప ఔట్‌ఫిట్‌ ఏముంది బ్రదర్‌?
  •  మిలియన్‌లో ఒక్కడిగా ఉండాలనుకోను.. మిలియన్‌ జనం మెచ్చేలా ఉండాలనుకుంటాను
  •  ఈ ప్రపంచం కోరుకున్నది ఇవ్వడానికి రాలేదు నేను.. నేను అనుకున్నదే చేయడానికొచ్చాను.
  • నేనెప్పుడూ ఓడిపోను గెలుస్తాను, లేదంటే నేర్చుకుంటూనే ఉంటాను.
  •  సవాళ్ల రహదారులు.. అందమైన గమ్యస్థానాలకు దారి తీస్తుంటాయి
  •  నిన్ను నువ్వే తోసుకుంటూ ముందుకెళ్లాలి.. ఆ పని చేయడానికి నీ వెనక ఎవరూ లేరు.
  •  నేను తోపు.. అని నమ్మడానికయ్యే ఖర్చు జీరో!
  •  హీరోలంతా టోపీలు పెట్టుకోరు.. కొంతమంది అద్భుతమైన సన్‌గ్లాసెస్‌తో కూడా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు