పవర్‌.. ఫుల్‌

జోరు మీదుండే కుర్రాళ్లు.. పవర్‌ఫుల్‌ బైక్‌లు కావాలనుకుంటారు. యాక్సిలేటర్‌ని అలా తిప్పగానే.. ఇలా గాల్లో తేలిపోవాలనుకుంటారు. అంత ‘పవర్‌’ చూపించే రూ.5 లక్షల లోపు కొన్ని మోటారు సైకిళ్లు ఇవి.

Published : 04 May 2024 00:07 IST

జోరు మీదుండే కుర్రాళ్లు.. పవర్‌ఫుల్‌ బైక్‌లు కావాలనుకుంటారు. యాక్సిలేటర్‌ని అలా తిప్పగానే.. ఇలా గాల్లో తేలిపోవాలనుకుంటారు. అంత ‘పవర్‌’ చూపించే రూ.5 లక్షల లోపు కొన్ని మోటారు సైకిళ్లు ఇవి.

ది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌
కాంటినెంటల్‌ జీటీ 650

ధర: రూ.19 లక్షలు

మేటి స్టైల్‌, పెర్‌ఫార్మెన్స్‌ మేళవిస్తే.. ఈ బండి. దూరప్రయాణాలకు ఉపయోగం. ఎలాంటి రహదారులపై అయినా దూసుకెళ్తుంది. 648సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 47బీహెచ్‌ పవర్‌ దీని సొంతం.


ది ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457

ధర: రూ.4.1లక్షలు

స్టైల్‌ని బాగా ఇష్టపడేవాళ్లు ఈ ఇటాలియన్‌ సొగసరికి ఓటేయొచ్చు. మామూలు రోడ్ల మీద రేసింగ్‌ అనుభవం పొందాలనుకునే కుర్రాళ్ల కోసమే ఈ బండి. 457సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 47బీహెచ్‌పీ దీని సొంతం.


ది కేటీఎం 390 డ్యూక్‌

ధర: రూ.3.18 లక్షలు

మిడ్‌సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్‌సైకిళ్లలో ఇదొకటి. 399సీసీ సింగిల్‌ సిలిండర్‌, 45బీహెచ్‌పీ దీని సొంతం. మిడ్‌ సెగ్మెంట్‌లో టాప్‌ పెర్‌ఫార్మర్‌.


ది యమహా ఆర్‌3

ధర: రూ.4.65 లక్షలు

స్పోర్ట్స్‌ మోటార్‌సైకిల్‌కి ఓటేయా లనుకునే అబ్బాయిల ఎంపిక ఈ బైక్‌. సొగసైన రూపం, మేటి పని తీరు దీని సొంతం. 321 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 41 బీహెచ్‌పీ ఉత్పత్తి చేస్తుంది.


ట్రయంఫ్‌ స్పీడ్‌ 400

ధర: రూ.2.33 లక్షలు

ట్రయంఫ్‌ కంపెనీ బేసిక్‌ మోడల్‌ ఇది. 398 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ 39బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఆకట్టుకునే రూపం దీని సొంతం.

ధరలు ఎక్స్‌ షోరూం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని