AP New Districts: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి: బాలకృష్ణ

వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు..

Updated : 27 Jan 2022 16:26 IST

అమరావతి: వైకాపా ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని.. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందన్నారు. రాజకీయ ఉద్దేశాలతో జిల్లాల ఏర్పాటు సరికాదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ స్పందించారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని