Andhra News: మాజీ మంత్రి దేవినేని ఉమ సహా తెదేపా నేతల అరెస్ట్‌

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసి

Updated : 11 Feb 2022 10:40 IST

గుంటూరు: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు దేవినేని ఉమ సహా తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్‌, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి తదితరులు వెళ్లారు. తెదేపా నేతలకు సీఐడీ కార్యాలయంలోకి అనుమతి లేదంటూ నగరంపాలెం పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనతో పాటు తెదేపా నేతలను అరెస్ట్‌ చేశారు. 

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే అనుమానం: దేవినేని

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారన్నారు. ఆయనపై దాడి చేస్తారా? తప్పుడు కేసులతో వేధిస్తారా? అని పోలీసులను నిలదీశారు. అశోక్‌బాబుపై సీఐడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారనే అనుమానం తమకుందని.. గతంలో ఎంపీ రఘురామకృష్ణను కూడా కొట్టారని దేవినేని ఉమ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని