logo

రావమ్మా తిరుపతమ్మ...రావమ్మా!

తిరుపతమ్మ రంగుల ఉత్సవ ఉరేగింపు ఘనంగా జరిగింది. పెనుగంచిప్రోలు నుంచి ఎడ్లబండ్లలో వచ్చే పరివార సమేత తిరుపతమ్మ, గోపయ్య మూలవిరాట్‌ మూర్తులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ

Updated : 22 Jan 2022 05:20 IST

రంగుల మండపానికి చేరిన పెనుగంచిప్రోలు దేవతా పరివారం

జగ్గయ్యపేటలోకి ప్రవేశించిన పరివార సమేత తిరుపతమ్మ, గోపయ్యల వాహనాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: తిరుపతమ్మ రంగుల ఉత్సవ ఉరేగింపు ఘనంగా జరిగింది. పెనుగంచిప్రోలు నుంచి ఎడ్లబండ్లలో వచ్చే పరివార సమేత తిరుపతమ్మ, గోపయ్య మూలవిరాట్‌ మూర్తులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ రోడ్డు మీదుగా జగ్గయ్యపేటలోకి ప్రవేశించారు. పొలిమేరల నుంచే రహదారికి ఇరువైపులా భక్తులు బారుల తీరి జలబిందెలు, హారతులు, ముడుపుల సమర్పణతో ఘనస్వాగతం పలికారు. వరుస కట్టిన ఎడ్లబండ్ల రథాలు కనుల పండువ చేశాయి. పట్టణ శివార్లలోనే ఆకుల బాజి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సహా మున్సిపల్‌ ఛైర్మన్‌ రాఘవేంద్ర, సామినేని ప్రశాంత్‌, స్థానిక ప్రముఖులు ఊరేగింపునకు ఎదురేగి హారతులు, టెంకాయలతో స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి పట్టణంలోని రంగుబజార్‌లో ముస్తాబైన మండపం వద్దకు నాయకులు, ప్రముఖులు దేవతామూర్తులను ఎత్తుకొని తీసుకొచ్చారు. ఆలయ ఛైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు, ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబల ఆధ్వర్యంలో రంగుల మండపంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు పంతంగి వెంకటేశ్వరరావు, మొరశెట్టి హరికిషన్‌లాల్‌, ఆచంటసతీష్‌, పద్మ, రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 12 వరకూ జగ్గయ్యపేటలోని రంగుల ఉత్సవ మండపంలోనే ఉండే పరివార దేవతా సమేత తిరుపతమ్మ, గోపయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు.

తిరుపతమ్మ తల్లి విగ్రహాన్ని రంగుల మండపంలోకి తీసుకెళ్తున్న ఛైర్మన్‌ రాఘవేంద్ర, సామినేని ప్రశాంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని