‘మా బడి మాకు కావాలి’

ఉన్న బడిని వదిలి కనీసం రోడ్డు సౌకర్యం లేని గ్రామంలోని పాఠశాలకు తమ పిల్లలను ఎలా పంపించాలంటూ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని లింగాయపాలెం గ్రామస్థులు మంగళవారం ధర్నాకు దిగారు.

Updated : 26 Jan 2022 04:56 IST

పాఠశాల ఎదుట ధర్నా

లింగాయపాలెం (తుళ్ళూరు), న్యూస్‌టుడే: ఉన్న బడిని వదిలి కనీసం రోడ్డు సౌకర్యం లేని గ్రామంలోని పాఠశాలకు తమ పిల్లలను ఎలా పంపించాలంటూ గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని లింగాయపాలెం గ్రామస్థులు మంగళవారం ధర్నాకు దిగారు. లింగాయపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 59 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 3, 4, 5 తరగతుల విద్యార్థులు 46 మందిని పక్క గ్రామం రాయపూడిలోని శ్రీకృష్ణదేవరాయలు జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ విద్యాశాఖ అధికారులు ప్రకటన జారీ చేశారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌ ఐనవోలు చంటిబాబు నేతృత్వంలో మంగళవారం బడి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ విషయంలో విద్యాశాఖ నిర్ణయాన్ని మార్చుకునే వరకు పోరాటం తప్పదని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని