మధ్యంతర ఉత్తర్వులన్నీ నెల పొడిగింపు

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాలిచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా నెలపాటు పొడిగిస్తూ సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

Published : 20 Jan 2022 04:56 IST

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాలిచ్చిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా నెలపాటు పొడిగిస్తూ సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశించింది. న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులు/స్టే ఉత్తర్వులను పొడిగించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారించింది. మొదటి, రెండో దశ వ్యాప్తిలోనూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కక్షిదారులు మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపునకు న్యాయస్థానాలను ఆశ్రయించడం కష్టమని పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈనెల 19 నుంచి నెలపాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని