శ్రీదేవి ప్రసాద్‌కు యుధ్‌వీర్‌ పురస్కారం

శంకర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 27 Apr 2024 06:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంకర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన పునరావాసం కల్పించడంతో పాటు వారి సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ మెమోరియల్‌’ ఈ అవార్డును ప్రకటించింది. 2000 సంవత్సరంలో ప్రారంభించిన శంకర్‌ ఫౌండేషన్‌ 24 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తోందని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు థెరపీ, విద్య, వృత్తి- పరివర్తన శిక్షణ, ఉపాధి తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోందని యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30న హైదరాబాద్‌ కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌ ఆడిటోరియంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా శ్రీదేవి ప్రసాద్‌కు అవార్డు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు