అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ అరెస్టు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్‌ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ టోనీని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

Published : 21 Jan 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్‌ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ టోనీని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చామని, అతడి నుంచి కారు, 10 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకుని గురువారం జైలుకు తరలించామని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉత్తర మండలం పోలీసులు పది రోజులుగా ముంబయిలో మకాం వేశారని, అక్కడి పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారని వెల్లడించారు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో తొమ్మిది మంది డ్రగ్‌ వినియోగదారులను కూడా అరెస్టు చేశామని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్‌బాయ్‌ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్‌ టోనీకి చేరుతున్నాయన్నారు. నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. మీరా భాండియార్‌, వాసైవిరార్‌ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తుండడడంతో తానూ అదేబాట పట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని