‘జీ హుజూర్‌ 23’ కాదు..

కాంగ్రెస్‌లో నాయకత్వలేమి, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ గళమెత్తారు. అధినాయకత్వం వైఖరికి సంబంధించిన వివిధ

Updated : 30 Sep 2021 10:24 IST

మళ్లీ గళమెత్తిన కపిల్‌ సిబల్‌

దిల్లీ: కాంగ్రెస్‌లో నాయకత్వలేమి, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ గళమెత్తారు. అధినాయకత్వం వైఖరికి సంబంధించిన వివిధ అంశాలపై సూటిగా మాట్లాడారు. తక్షణం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే సీడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేయాలని ‘గ్రూప్‌ ఆఫ్‌ 23 (జీ23)’ సీనియర్‌ సభ్యుడొకరు సోనియాకి లేఖ రాసినట్లు సిబల్‌ బుధవారం విలేకరులకు చెప్పారు. ‘జీ23’ అంటే ‘జీ హుజూర్‌ 23’ కాదని  స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో పరిస్థితులపై కపిల్‌ సిబల్‌ మాట్లాడిన కొద్ది గంటలకే ఆ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు.  

తక్షణం సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని