రైతుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం: సీపీఎం

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. నెల రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య

Published : 15 Jan 2022 04:08 IST

పొదిలి, న్యూస్‌టుడే: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. నెల రోజుల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోందన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు, ఇతర పంటలు వేసిన వారికి ఎకరాకు రూ.50 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కరోనా మూడో దశ తీవ్రరూపం దాలుస్తున్నందున సీపీఎం తరఫున ప్రజలకు సేవలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేసి వైద్యుల సహకారంతో రోగులకు సూచనలు, సలహాలు ఇప్పించనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని