తప్పు చేయని నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?

తాను ఎలాంటి తప్పూ చేయలేదని..అయినా తనను వైకాపా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో గురువారం ఆయన

Updated : 03 Jun 2022 05:54 IST

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపాటు

నరసాపురం, న్యూస్‌టుడే: తాను ఎలాంటి తప్పూ చేయలేదని..అయినా తనను వైకాపా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తన పలుకుబడిని దెబ్బతీసేందుకు సస్పెండ్‌ చేశారన్నారు. సంజాయిషీ అడగకుండా, షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా..క్రమశిక్షణ కమిటీ సంతకం లేని లేఖను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడటం తప్పయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉద్యమాలు చేసిన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మీడియాలో రోజూ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఎందుకు సస్పెండ్‌ చేయలేదన్నారు. ‘నేను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమి చేశానో, నాపై ఎవరు ఫిర్యాదు చేశారో మీడియాకు తెలియజేయాలి. పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన నాపై ఒక్క అవినీతి మచ్చకూడా లేదు. నేను గెలిపించిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గానికి నష్టం చేకూర్చే చర్యలను చేస్తున్నారు. వాటిని ప్రశ్నించినందుకు ఆయన నాపై తప్పుడు ఫిర్యాదులు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలుపొందడం ఖాయం. నియోజకవర్గ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం ఎప్పుడూ గాంధేయమార్గంలోనే పోరాటం చేస్తా’ అని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని