కాలనీ వద్ద మద్యం దుకాణమా?

కర్నూలులోని ఉల్చాలరోడ్డు వై-జంక్షన్‌ నుంచి మద్యం దుకాణాన్ని కాలనీ వద్దకు మార్చడంతో స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం తొలగించాలని

Published : 29 Nov 2021 03:56 IST

తొలగించాలంటూ మహిళల ఆందోళన

మద్యం దుకాణం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులోని ఉల్చాలరోడ్డు వై-జంక్షన్‌ నుంచి మద్యం దుకాణాన్ని కాలనీ వద్దకు మార్చడంతో స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం తొలగించాలని డిమాండు చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం దుకాణాన్ని ముట్టడించారు. రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మల మాట్లాడుతూ.. క్రమంగా మద్యం దుకాణాలు తగ్గించి మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మండిపడ్డారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు ఉండే ప్రదేశంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దుకాణం మార్పు చేసేందుకు గడువు ఇవ్వాలని అధికారులు కోరగా నిరాకరించారు. చివరకు దుకాణం మూసివేయడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి అలివేలు, సీపీఎం నాయకులు జమ్మన్న, షబానా, లత, మమత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని