భూప్రకంపనలతో భయాందోళన

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయత్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలతో వచ్చిన భారీ

Updated : 02 Dec 2021 04:30 IST

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయత్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలతో వచ్చిన భారీ శబ్దాలకు జనం హడలిపోయారు. ఇళ్లు కూలిపోతాయేమోననే భయంతో వీధుల్లోకి పరుగులుతీశారు. తిమ్మయ్యగారిపల్లెలో స్థానికులు ఊరికి సమీపంలోని బండపైకి చేరుకుని టార్పాలిన్‌ పట్టలతో గుడారాలు వేసుకున్నారు. బుధవారమూ భూప్రకంపనలు కొనసాగడంతో తహసీల్దార్‌ సీతారాం, ఎంపీడీవో రాజేంద్రబాలాజీ, ఎస్సై మునిస్వామి గ్రామాల్లో పర్యటించారు. భూమి పొరల్లోకి నీరు చేరడంతో శబ్దాలు వచ్చి ఉండవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని