
సుబాబుల్, జామాయిల్‌కు గిట్టుబాటు ధరలివ్వండి
మంత్రి కన్నబాబు సూచన
ఈనాడు, అమరావతి: సుబాబుల్, జామాయిల్‌కు గిట్టుబాటు ధరలను చెల్లించాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు కాగితపు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. విజయవాడలోని మార్క్‌ఫెడ్ కార్యాలయంలో కాగితపు పరిశ్రమలు, ప్లైవుడ్ సంస్థల ప్రతినిధులతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. గిట్టుబాటు ధరలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ ప్రద్యుమ్న, జేడీ శ్రీనివాసరావు, డీడీ దివాకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.