- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
చెన్నై: ప్రముఖ నటి మీనా(Meena) భర్త విద్యాసాగర్ (48) (Vidya Sagar) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కొవిడ్ (Covid-19) బారిన పడింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. గత కొన్నిరోజులుగా విద్యాసాగర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మరణంతో మీనా కుటుంబంలో విషాదం నెలకొంది. భర్త మృతితో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు, విద్యాసాగర్ మరణవార్త తెలుసుకున్న నటుడు శరత్‌కుమార్, నటి మంచు లక్ష్మిలతో పాటు పలువురు సినీతారలు, నెటిజన్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాసాగర్ ఆకస్మిక మరణం తమను ఎంతో కలచి వేస్తోందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మీనా- విద్యాసాగర్లది పెద్దలు కుదిర్చిన వివాహం. దక్షిణాదికి చెందిన ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన మీనా.. కెరీర్లో రాణిస్తోన్న తరుణంలోనే బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. జులై 12, 2009లో వీరి వివాహం జరిగింది. మీనా దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sisodia: కేంద్రం కూడా కాదట.. మరి ఆ నిర్ణయం ఎవరిది?
-
India News
Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!
-
General News
Andhra News: యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
-
Movies News
OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు
-
Politics News
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Thiru review: రివ్యూ: తిరు
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో