అమ్మఒడికి ఏర్పాట్లు చేయండి

అమ్మఒడి పథకం సాయాన్ని ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నందున, తదనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ...

Published : 26 Jun 2022 05:09 IST

ఈనాడు, అమరావతి: అమ్మఒడి పథకం సాయాన్ని ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నందున, తదనుగుణంగా జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. మండలం, పురపాలక, నగరపాలక సంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు లబ్ధిదారులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించింది. కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు ఆదేశాలు ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌కు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని