Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులతో ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి

Updated : 15 Aug 2022 07:38 IST

సర్వదర్శనానికి 40 గంటలు

శనివారం 83వేల మందికి శ్రీవారి దర్శనం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులతో ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్‌ మీదుగా రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు చాలా మంది వేచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 40 గంటలు పడుతోందని తితిదే ప్రకటించింది. ఆదివారం సాయంత్రానికి 60వేల మంది  శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్‌లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను తితిదే తిరుపతి జేెఈవో వీరబ్రహ్మం, తిరుమల ఆరోగ్యాధికారిణి డాక్టర్‌ శ్రీదేవి, అన్నదానం డిప్యూటీ ఈవో పద్మావతి పరిశీలించారు. తిరుమలలో తిరిగే శ్రీవారి బ్రహ్మరథాలు, తిరుపతి-తిరుమల మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఎటుచూసినా భక్తుల సందడే కనబడుతోంది. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమలకు దర్శనానికి రావాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం శ్రీవారిని 83,422 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.27 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 50,100 మంది తలనీలాలు సమర్పించారు. గదుల కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని