విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్సీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.సీతారాంరెడ్డి (94) కన్నుమూశారు.

Updated : 18 Nov 2022 05:42 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్సీ, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.సీతారాంరెడ్డి (94) కన్నుమూశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ సమీప ఉండవల్లిలో చిన్నారెడ్డి, వెంకట్రావమ్మ దంపతులకు 1928లో జన్మించిన సీతారాంరెడ్డి లండన్‌లో బారిస్టర్‌ చదివారు. 1960-1968 మధ్య గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా, 1978 నవంబరు 10 నుంచి 1990 మార్చి 11 వరకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 1990 మార్చి నుంచి 1995 మార్చి వరకు ఏపీ లోకాయుక్తగా వ్యవహరించారు. ఆయన భార్య మనోరమాదేవి గతంలోనే మృతి చెందారు. వారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి, రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్యలు జస్టిస్‌ సీతారాంరెడ్డి భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని