రాష్ట్రంలో ‘ఎయిడ్స్‌’ ప్రభావం తగ్గుతోంది

ఎయిడ్స్‌ బారిన పడిన వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ వెల్లడించారు.

Published : 01 Dec 2022 05:12 IST

ఈనాడు, అమరావతి: ఎయిడ్స్‌ బారిన పడిన వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం (డిసెంబరు 1) సందర్భంగా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థాపరంగా తీసుకుంటున్న చర్యల్లో సాధారణ జనాభాలో హెచ్‌ఐవీ పాజిటివిటీ 6.74% (2010-11) నుంచి 0.87% (2022-23)కి తగ్గిందని నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. గర్భిణుల్లో హెచ్‌ఐవీ పాజిటివిటీ 0.46% (2010-11) నుంచి 0.05% (2022-23)కి తగ్గిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,888 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని