రాజ్‌భవన్‌లో గోవా రాష్ట్ర అవతరణ వేడుకలు

గోవాలోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కారణంగా ‘ప్రాచ్య ముత్యం’గా ప్రత్యేక గుర్తింపు సాధించిందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.

Published : 31 May 2023 04:21 IST

ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఈనాడు, అమరావతి: గోవాలోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కారణంగా ‘ప్రాచ్య ముత్యం’గా ప్రత్యేక గుర్తింపు సాధించిందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర సంస్కృతి, బీచ్‌లు, ఆతిథ్య రంగంలో దేశంలోనే ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయన్నారు. ఆతిథ్య రంగం ద్వారా జాతీయ అభివృద్ధికి రాష్ట్రం దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు. గోవా రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గోవా అందాలు, సంపద, లాభదాయకమైన పోర్టులు పశ్చిమ దేశాలను ఆకర్షించడంతో.. ఆయా దేశాలతో వాణిజ్యం సులభతరమైంది. ఈ కారణంగా గోల్డెన్‌ గోవాగా పిలిచేవారు...’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గోవా సంప్రదాయ నృత్యాలు ఆహుతులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని