నిధులు లేక.. గ్రామ దుస్థితిని చూడలేక..

గ్రామ పంచాయతీకి నిధులు లేవు.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామ సర్పంచే పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు.

Published : 05 Jun 2023 04:45 IST

పారిశుద్ధ్య పనులు చేసిన సర్పంచి

గ్రామ పంచాయతీకి నిధులు లేవు.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామ సర్పంచే పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండల కేంద్రం సర్పంచి రామాంజనేయులు ఆదివారం స్వయంగా పారిశుద్ధ్య పనులు చేశారు. ఎస్సీ కాలనీలో మురుగు కాలువల నుంచి మురుగును పారతో గంపలోకి వేసుకుని తొలగించారు. పూడిక, చెత్తాచెదారాన్ని తన సొంత ఎద్దుల బండిపై గ్రామం బయటకు తరలించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సర్పంచి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచి పేర్కొన్నారు.

 న్యూస్‌టుడే, తుగ్గలి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని