AP Teachers: రూ.లక్షల జీతాలు తీసుకొని పాఠాలు చెప్పరా?: టీచర్లపై ప్రవీణ్‌ ప్రకాశ్‌ మండిపాటు

‘ప్రభుత్వ పాఠశాలలకొచ్చే విద్యార్థులంతా పేదలే ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధిస్తారనే ఆశతో వారి తల్లిదండ్రులు బడికి పంపుతారు.

Updated : 29 Oct 2023 11:55 IST

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వ పాఠశాలలకొచ్చే విద్యార్థులంతా పేదలే ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధిస్తారనే ఆశతో వారి తల్లిదండ్రులు బడికి పంపుతారు. వారికి పాఠాలు సక్రమంగా చెప్పకుండా, హోంవర్కు చూడకుండా జీవితాలతో ఆడుకుంటున్నారు. రూ.లక్షల వేతనాలు తీసుకొని పాఠాలు చెప్పకపోతే ఎలా?’ అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అనంతపురం జిల్లా విద్యాధికారులు, ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ప్రవీణ్‌ప్రకాశ్‌ శనివారం అనంతపురంలోని నగరపాలక పాఠశాలలు, ఆత్మకూరు మండలం పి.యాలేరు పాఠశాలలను తనిఖీ చేశారు. అనంత నగరపాలక పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకంటే పాఠశాలలో ఎక్కువే ఉన్నారని, వారందరికీ కూర్చోబెట్టి వేతనాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు రాకపోవడానికి తాను సహా విద్యాశాఖ కమిషనర్‌, ఆర్జేడీ, కలెక్టర్‌, డీఈవోలూ కారణమేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. యాలేరు పాఠశాలలో స్మార్ట్‌టీవీలు వినియోగించడం లేదని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని