Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌ మూడో కౌన్సెలింగ్‌ ఉంటుందా.. లేదా?

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ మూడోవిడత కౌన్సెలింగ్‌ ఉంటుందా.. లేదా అనేదానిపై స్పష్టత కొరవడింది. ప్రతి ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించే ఉన్నత విద్యామండలి ఈ ఏడాది రెండు విడతలతోనే సరిపెట్టింది.

Updated : 29 Oct 2023 09:44 IST

నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించిన మంత్రి బొత్స
నోటిఫికేషన్‌పై ఉన్నత విద్యామండలి మౌనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ మూడోవిడత కౌన్సెలింగ్‌ ఉంటుందా.. లేదా అనేదానిపై స్పష్టత కొరవడింది. ప్రతి ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించే ఉన్నత విద్యామండలి ఈ ఏడాది రెండు విడతలతోనే సరిపెట్టింది. మూడోవిడత ఉంటుందని చాలామంది విద్యార్థులు రెండోవిడతలో సీట్లు వచ్చినా చేరలేదు. మరికొందరు కోర్సులు, కళాశాలలు మార్చుకోవచ్చని ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో మొదట్లో మూడోవిడత నిర్వహణపై పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ, ఇంతవరకు దీనిపై ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కన్వీనర్‌ కోటాలో చేరేవారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవారు ఉంటారు. కన్వీనర్‌ కోటాలో చేరేవారికి ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. స్పాట్‌, యాజమాన్య కోటాల్లో చేరితే విద్యార్థులే ఫీజుల భారం భరించాలి. మూడోవిడతపై స్పష్టత లేక.. చాలామంది స్పాట్‌, యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చింది. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండాల్సిన కౌన్సెలింగ్‌.. ప్రభుత్వం ఫీజుల డబ్బులు మిగుల్చుకునేలా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని