Chirala: అయ్యా.. ఇది న్యాయమేనా!: దుకాణాలకు అడ్డుగా వైకాపా ఫ్లెక్సీలు

వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో అధికార పార్టీ.. ఫ్లెక్సీలతో నింపేసింది. దాదాపు 30 దుకాణాలకు అడ్డుగా వీటిని ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 Jan 2024 10:06 IST

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో అధికార పార్టీ.. ఫ్లెక్సీలతో నింపేసింది. దాదాపు 30 దుకాణాలకు అడ్డుగా వీటిని ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే చేసేదిలేక వ్యాపారాలు మానుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతోపాటు సంగం థియేటర్‌కి సమీపంలో రెండువైపులా రహదారులకు అడ్డుగా స్టాపర్స్‌ పెట్టడంతో.. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షెడ్యూల్‌ ప్రకారం 3గంటల 30 నిమిషాలకు పార్టీ సమావేశం అని నేతలు ప్రకటించారు. ఉదయం 10 గంటల కన్నా ముందే రోడ్లపై స్టాపర్స్‌ పెట్టడంపై అధికారపార్టీ నాయకులు, పోలీసుల తీరుపై వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు. సాయంత్రం 6.30 గంటలవరకు అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని