విశాఖ విమానాశ్రయంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి నిరంతర సేవలు

ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖపట్నం విమానాశ్రయంలో 24×7 ప్రాతిపదికన ‘రన్‌ వే’ అందుబాటులోకి వస్తుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

Published : 27 Mar 2024 04:26 IST

విశాఖపట్నం(సింధియా), న్యూస్‌టుడే: ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖపట్నం విమానాశ్రయంలో 24×7 ప్రాతిపదికన ‘రన్‌ వే’ అందుబాటులోకి వస్తుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు తూర్పు నౌకాదళానికి చెందిన నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో రన్‌ వే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం విమానాల రాకపోకలపై రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8వరకు నిషేధం కొనసాగుతుందని.. పనులు పూర్తవగానే నిబంధన సడలిస్తామని స్పష్టం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని