సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి బరితెగింపు

సాక్షాత్తూ ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో.. ప్రభుత్వ సలహాదారు ఒకరు బరితెగించారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ విమర్శలకు సచివాలయాన్నే వేదికగా చేసుకున్నారు.  

Published : 27 Mar 2024 04:36 IST

ఈనాడు, అమరావతి: సాక్షాత్తూ ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో.. ప్రభుత్వ సలహాదారు ఒకరు బరితెగించారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ విమర్శలకు సచివాలయాన్నే వేదికగా చేసుకున్నారు.  ఎన్నికల నియమావళిని పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం అంటే లెక్కే లేదన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం సచివాలయంలోని నాలుగో బ్లాకులో విలేకరుల సమావేశం పెట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లపై విమర్శలు చేశారు. అంతటితో ఆగలేదు సరికదా? ప్రభుత్వ ఉద్యోగులంతా ఓటుహక్కు వినియోగించుకుని, సీఎం జగన్‌కు ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు.వాలంటీర్లెవరూ ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. దీనిని ఉల్లంఘించిన వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు కొందరిపై కేసులూ నమోదు చేస్తోంది. వాలంటీర్ల నెల జీతం రూ.5 వేలే. మరి రూ.లక్షల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ సలహాదారులకు కోడ్‌ వర్తించదా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోడ్‌ అమల్లోకి వచ్చినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి తెదేపా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరో ప్రభుత్వ సలహాదారు సచివాలయాన్నే రాజకీయ వేదికగా మార్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని