రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం

ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు.

Published : 02 May 2024 05:28 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో రోడ్‌ రోలర్‌తో ఈ సీసాలను తొక్కించారు. హనుమాన్‌ జంక్షన్‌ పరిధిలోని మెట్లపల్లిలో ఉన్న ఓ గెస్ట్‌ హౌస్‌ నుంచి ఈ సరకును రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేపట్టామని.. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. మద్యం ధ్వంసం చేసేందుకు ఎస్పీ, ఆర్వో జేసీ గీతాంజలిశర్మ రోడ్‌ రోలర్‌కు జెండా ఊపిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, బాటసారులు భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని