పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 05:37 IST

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు సీఎఫ్‌డీ ప్రతినిధుల వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దాడులకు పాల్పడింది ఏ పార్టీ వారైనా.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర నూతన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఆయన కార్యాలయంలో మంగళవారం సీఎఫ్‌డీ ప్రతినిధులు జంధ్యాల శంకర్‌, లక్ష్మణరెడ్డితో కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో నిమ్మగడ్డ మాట్లాడారు. ‘మచిలీపట్నం, పెనమలూరు దాడి ఘటనల్లో పోలీసుల ఆలస్యంగా కేసులు నమోదు చేయడం శోచనీయం. ఎన్నికల నిర్వహణలో పక్షపాతధోరణి లేకుండా వ్యవహరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశాం. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్‌ పోలీసు అధికారులకు ‘ఎన్నికల నిఘా వేదిక’ లేఖలు రాసింది. డీజీపీ కూడా మా విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌లోనూ గందరగోళం నెలకొందంటే ఇది ఎన్నికల కమిషన్‌ అసమర్థతకు నిదర్శనం. కేవలం 3 లక్షల మంది ఉద్యోగ ఓటర్లకు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. ఎన్నికల నిఘా వేదికకు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటినీ సంబంధిత అధికారులకు చేరవేస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని రమేశ్‌కుమార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు