Bajaj Pulsar: బజాజ్‌ నుంచి కొత్త పల్సర్‌ N250

Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో కొత్త N250ని లాంచ్‌ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Updated : 10 Apr 2024 15:52 IST

Bajaj Pulsar N250 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో (Bajaj auto) 2024 మోడల్‌ ఎన్‌ 250ని మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1.50 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. డిజైన్‌ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. హార్డ్‌వేర్‌, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేపట్టింది. గ్లోసీ రేసింగ్ రెడ్, బ్రూక్లిన్ బ్లాక్, పెరల్‌ మెటాలిక్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

నవీకరించిన ఎన్‌ 250 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 249cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 24 bhp, 21.5Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. ముందువైపు 300mm డిస్క్‌ బ్రేక్‌, వెనకవైపు 230mm రియర్‌ డిస్క్‌ బ్రేక్‌ ఇస్తున్నారు. ముందువైపు టెలిస్కోపిక్‌కు బదులుగా USD ఫోర్క్స్‌ని అమర్చారు. వెనకవైపు మోనోషాక్‌ ఇచ్చారు.

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. రిలయన్స్‌తో మస్క్‌ చర్చలు?

ఈ కొత్త పల్సర్ డ్యూయల్‌ ఛానెల్ ABS డిస్క్ బ్రేక్‌లతో వస్తోంది. రెయిన్‌, రోడ్‌, ఆఫ్‌-రోడ్‌ అనే మూడు ఇందులో ఉంటాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఉంది. ఫోన్‌ కనెక్ట్‌ చేసుకొనే సదుపాయంతో కొత్త డిజిటల్‌ డ్యాష్‌బోర్డ్‌, ఎల్‌సీడీ యూనిట్‌ ఇచ్చారు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌, నోటిఫికేషన్‌ అలర్ట్‌, కాల్‌, ఎస్సెమ్మెస్‌ అలెర్ట్‌ ఉన్నాయి. స్పీడోమీటర్‌తో పాటు ఫ్యూయల్‌ లెవల్‌, డిస్టెన్స్‌ టు ఎంప్టీ, మైలేజ్‌ వంటివి ఇందులో కనిపిస్తాయని బజాజ్‌ ఆటో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని