కార్డు బిల్లు సెటిల్‌ చేశారా?

క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. అనివార్య పరిస్థితుల్లో బిల్లును సెటిల్‌మెంట్‌ చేసుకోవాల్సి వస్తే? అది కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు.

Updated : 10 May 2024 04:49 IST

క్రెడిట్‌ కార్డు బిల్లును సకాలంలో చెల్లించాలి. అనివార్య పరిస్థితుల్లో బిల్లును సెటిల్‌మెంట్‌ చేసుకోవాల్సి వస్తే? అది కొంత మేరకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ, అది సిబిల్‌ స్కోరుపై చిరకాల ముద్ర వేస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించలేదని రుణదాతలకు సంకేతాలు ఇస్తుంది. ఇది భవిష్యత్తులో కొత్త అప్పులు తీసుకునేందుకూ, తక్కువ వడ్డీని పొందేందుకూ అడ్డంకిగా మారొచ్చు.

గతంలో ఎప్పుడైనా క్రెడిట్‌ కార్డు బిల్లును సెటిల్‌ చేసుకుంటే ఒకసారి మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేయండి. మీరు పూర్తి మొత్తాన్ని చెల్లించలేదు కాబట్టి, ‘సెటిల్డ్‌’గా పేర్కొంటారు. ఇది మీ సిబిల్‌ స్కోరును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించేందుకు బ్యాంకు/కార్డు సంస్థను సంప్రదించండి. ఖాతా స్థితిని ‘క్లోజ్డ్‌’గా మార్చాలని కోరండి. కొన్ని సంస్థలు మరికొంత మొత్తాన్ని అదనంగా చెల్లిస్తే మార్చేందుకు వీలుంది. అప్పుడు మీ స్కోరు మెరుగవుతుంది.

క్రెడిట్‌ స్కోరు చాలా తక్కువగా ఉన్నప్పుడు మీ పాత అప్పుల్లో ఏదైనా బాకీలు ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. నివేదికలో ఏమైనా తప్పులుంటే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లండి. మీ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలను తొలగించాల్సిందిగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయండి.

క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతం లోపే వినియోగించండి. తక్కువ క్రెడిట్‌ వినియోగం వల్ల స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంది. రుణ వాయిదాలు, కార్డు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కాకుండా చూసుకోండి. అప్పుడు మీ స్కోరు మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది.

  • స్కోరు సరిగా లేక క్రెడిట్ కార్డు రాని సందర్భం ఎదురైతే.. ముందస్తు డిపాజిట్‌తో కార్డును తీసుకోండి. సాధారణంగా బ్యాంకులు రూ.20వేల డిపాజిట్‌తో క్రెడిట్‌ కార్డును ఇస్తుంటాయి. ఇందులో 80 శాతం వరకూ వినియోగించుకోవచ్చు. దీనికి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తూ ఉంటే స్కోరు పెరుగుతూ ఉంటుంది.
  • క్రెడిట్‌ స్కోరు అధికంగా ఉన్నప్పుడే రుణాలు సులభంగా లభిస్తాయని గుర్తుంచుకోండి. వడ్డీ రేట్లలోనూ 0.5 శాతం నుంచి 1 శాతం వరకూ రాయితీ లభిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని