Automobile exports: 2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు

Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది.

Published : 14 Apr 2024 16:47 IST

Automobile exports | దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు (Automobile exports) తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.5శాతం శాతం తగ్గినట్లు ‘వాహన తయారీదార్ల సమాఖ్య (SIAM)’ వెల్లడించింది. విదేశీ మార్కెట్లలో ద్రవ్య సంక్షోభమే (monetary crisis) దీనికి కారణమని పేర్కొంది. 2023లో ఆర్థిక సంవత్సరంలో 47,61,299 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు.. 2024 నాటికి 45,00,492కు పరిమితమయ్యాయి.

జీ-మెయిల్‌లో లార్జ్‌ ఫైల్స్‌ను సెండ్‌ చేయడం ఎలా?

  • ప్రయాణికుల వాహన (Passenger vehicles) ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 1.4 శాతం పెరిగి 6,72,105కు చేరాయి.
  • 2023లో 36,52,122 యూనిట్లుగా ఉన్న ద్విచక్ర వాహన ఎగుమతులు 2024 నాటికి 5.3శాతం తగ్గి 34,58,416కు పరిమితమయ్యాయి.
  • వాణిజ్య వాహనాల ఎగుమతులు కూడా క్షీణించాయి. 2023లో 78,645 యూనిట్లుగా ఉండగా.. ఆ సంఖ్య 2024లో 65,816కు తగ్గింది.
  • త్రిచక్ర వాహన ఎగుమతులు 3,65,549 యూనిట్ల నుంచి 18శాతం తగ్గి 2,99,977 యూనిట్లకు చేరాయి.
  • మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎగుమతులు 2,55,439 యూనిట్ల నుంచి 2,80,712కు చేరాయి.
  • హ్యుందాయ్‌ మోటార్స్‌ (Hyundai Motor) 1,63,155, కియా మోటార్స్‌ (Kia Motors) 52,105, ఫోక్స్‌వ్యాగన్‌ (Volkswagen) 44,180 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేశాయి. 
  • నిస్సాన్‌ మోటార్‌ ఇండియా (Nissan Motor India) 42,989, హోండా 37,589 యూనిట్ల కార్లను విదేశాల్లో విక్రయించాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని