Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!

చైనాలో మరో టెక్‌ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. 

Updated : 12 Mar 2024 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)కు చెందిన టెక్‌ దిగ్గజం షావోమీ విద్యుత్తు వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. తొలి కారు స్పీడ్‌ అల్ట్రా (ఎస్‌యూ)7 డెలివరీలను ఈనెల నుంచి మొదలుపెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీని ధరను మార్చి 28వ తేదీన ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కారు విక్రయాల కోసం చైనాలోనే 29 చోట్ల 59 స్టోర్లను సిద్ధం చేసినట్లు సంస్థ పేర్కొంది. 

ఎస్‌యూ7ను గతేడాది ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి ఐదు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని షావోమీ సీఈవో లీ జున్‌ తెలిపారు. రానున్న పదేళ్లలో కార్ల విభాగంలో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఎస్‌యూ7లో సూపర్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ టెక్నాలజీని వినియోగించామని చెప్పారు. ఫలితంగా టెస్లా, పోర్షె ఈవీలు చురుగ్గా వేగాన్ని అందుకొంటుందన్నారు. ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 కి.మీ. వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అత్యధికంగా గంటకు 210 కి.మీ. వేగం అందుకోగలదు. ఇక ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఛార్జింగ్‌తో 800 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 265 కిలోమీటర్లు దీని టాప్‌స్పీడ్‌.  

పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు

షావోమి వాహనాల్లో కూడా ఫోన్లు, ఇతర పరికరాల్లో వినియోగించే ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే వాడింది. ఇక దీనిని బీజింగ్‌లోని ప్రభుత్వ రంగానికి చెందిన బీఏఐసీ గ్రూప్‌ తయారీ ప్లాంట్‌లో నిర్మిస్తోంది. ఇక్కడ ఏటా 2,00,000 వాహనాలను ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం విద్యుత్తు కార్ల మార్కెట్లో భారీ ధరల కోత నడుస్తోంది. ప్రత్యర్థి సంస్థలైన టెస్లా, బీవైడీ తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని