Force Motors: ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్‌ మోటార్స్‌ గుడ్‌బై

Force Motors: ఆటో మొబైల్‌ కంపెనీ ఫోర్స్‌ మోటార్స్‌ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Published : 29 Mar 2024 21:26 IST

Force Motors | దిల్లీ: ఆటో మొబైల్‌ కంపెనీ ఫోర్స్‌ మోటార్స్‌ (Force Motors) కీలక ప్రకటన చేసింది. ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ట్రాక్టర్లు, అనుబంధ కార్యకలాపాల నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈమేరకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్‌ ఏఐలో శిక్షణ

ఉత్పత్తి హేతుబద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన విభాగాలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు ఫోర్స్‌ మోటార్స్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇకపై లాస్ట్‌- మైల్‌ మొబిలిటీ, సరకు రవాణా, డిఫెన్స్‌కు ప్రత్యేక వాహనాలు సమకూర్చడం, ప్రీమియం లగ్జరీ OEMలకు టెక్నాలజీ అందించడం వంటి విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అందుకనే ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నామని తెలిపింది. వ్యవసాయ ట్రాక్టర్ల విక్రయాల ద్వారా 2023 మార్చితో ముగిసిన సంవత్సరానికి రూ.182.53 కోట్ల ఆదాయం వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో 3.66 శాతం మాత్రమేనని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని