4-7 తేదీల్లో ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీఓ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట 112 విక్రయశాలలను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది.

Published : 26 Sep 2022 02:13 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట 112 విక్రయశాలలను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది. అక్టోబరు 4-7 తేదీల్లో ఈ ఐపీఓ జరగనుంది. యాంకర్‌ మదుపర్లు అక్టోబరు 3న బిడ్‌లు దాఖలు చేయొచ్చు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమీకరించేందుకు 2021 సెప్టెంబరులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.111.44 కోట్లు మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. రూ.55 కోట్ల రుణభారాన్ని తగ్గించుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని