బొమ్మల తయారీ రంగానికి రూ.3,500 కోట్ల ప్రోత్సాహకాలు!

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) ప్రయోజనాలను బొమ్మల తయారీ పరిశ్రమలకూ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఒక అధికారి వెల్లడించారు.

Published : 05 Dec 2022 04:31 IST

దిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) ప్రయోజనాలను బొమ్మల తయారీ పరిశ్రమలకూ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఒక అధికారి వెల్లడించారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిబంధనల ప్రకారం బొమ్మలు తయారు చేస్తున్న సంస్థలకు రూ.3,500 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో దేశీయ సంస్థలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో బొమ్మలు తయారు చేసి, దిగ్గజ సంస్థలతో పోటీ పడగలవన్నది అంచనా. ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులూ పెంచుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యతా నిబంధనలు విధించడానికి తోడు దిగుమతి సుంకాన్ని 20 నుంచి 60 శాతానికి పెంచడం వంటి చర్యల  ద్వారా నాసిరకం బొమ్మల దిగుమతుల్ని నిరోధించినట్లు అయ్యిందని ఆ అధికారి వివరించారు.

* పీఎల్‌ఐ పథకం కింద ఇప్పటికే 14 రంగాలకు రూ.2 లక్షల కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో వాహన, వాహన విడిభాగాలు, ఔషధ, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, సౌర పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌, స్పెషాల్టీ స్టీల్‌, మన్నికైన ఎలక్ట్రానిక్‌ పరికరాల వంటి పలు రంగాలున్నాయి. తాజాగా బొమ్మలతో పాటు వివిధ రంగాలకు రూ.35,000 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని