హానర్‌ బ్రాండ్‌ ఫోన్లు మళ్లీ వస్తున్నాయ్‌

హానర్‌టెక్‌ తన హానర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను తిరిగి ప్రవేశపెట్టనుంది. రూ.1,000 కోట్ల మేర ప్రాథమిక పెట్టుబడులతో, సెప్టెంబరులో ఫోన్లను దేశీయ మార్కెట్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మాధవ్‌ సేథ్‌ వివరించారు.

Updated : 22 Aug 2023 06:40 IST

దిల్లీ: హానర్‌టెక్‌ తన హానర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను తిరిగి ప్రవేశపెట్టనుంది. రూ.1,000 కోట్ల మేర ప్రాథమిక పెట్టుబడులతో, సెప్టెంబరులో ఫోన్లను దేశీయ మార్కెట్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మాధవ్‌ సేథ్‌ వివరించారు. వచ్చే ఏడాది చివరకు మార్కెట్‌ వాటా పరిమాణంలో 4-5% సాధించాలనే లక్ష్యంతో కంపెనీ ఉందని.. అంటే రూ.10,000 కోట్ల ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘హానర్‌టెక్‌ పూర్తిగా భారత కంపెనీయే. చైనా కంపెనీ హానర్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందం కింద ఫోన్లు తీసుకురానున్నాం. విక్రయాల నుంచి తయారీ వరకు భారత్‌లోనే చేయనున్నాం. హానర్‌కు ఎటువంటి రాయల్టీ వెళ్లద’ని తెలిపారు. హానర్‌ బ్రాండ్‌ను తొలుత చైనా టెలికాం కంపెనీ హువావే సృష్టించింది. 2020 నవంబరులో ఇంకో చైనా సంస్థ అయిన షెంఝెన్‌ జిక్సిన్‌ న్యూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి విక్రయించింది. ఇపుడు హానర్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకు వచ్చేందుకు పీఎల్‌ఐకి అర్హత ఉన్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల సంస్థలతో చర్చిస్తున్నట్లు సేథ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని