Fixed Deposits: కార్పొరేట్‌ సంస్థలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు ఇవే..

'AAA' రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ సంస్థలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఇస్తున్నాయి.

Published : 02 Feb 2024 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కూడా వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందజేస్తున్నాయి. బ్యాంకు వడ్డీ కన్నా అధిక రాబడి సంపాదించాలని భావించేవారు వీటిని పరిశీలించొచ్చు. సీనియర్‌ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటును ఇస్తున్నాయి. అయితే, 'AAA' రేటింగ్‌ ఉన్న కంపెనీ డిపాజిట్లలోనే డిపాజిట్‌ చేయడం మేలు. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కూడా DICGC కింద డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. కంపెనీ డిపాజిట్లకు ఈ ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఉండదని డిపాజిటదార్లు గుర్తించాలి. 'AAA' రేటింగ్‌ ఉన్న కంపెనీలు, వివిధ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు అందజేసే వడ్డీ రేట్లు కింది పట్టికలో ఉన్నాయి.

నోట్‌: ఈ డేటా 2024, జనవరి 28 నాటిది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని