మూడేళ్లలో రూ.కోటి కోట్లకు

రాబోయే మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.కోటి కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌కే ఝా అంచనా వేశారు.

Published : 24 Jan 2024 02:03 IST

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమపై అంచనాలు
ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌కే ఝా

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.కోటి కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్‌కే ఝా అంచనా వేశారు. 2022లో రూ.40 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం, 2023 చివరికి రూ.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. చిన్న మదుపరులు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అధికంగా ఆసక్తి చూపడమే ఇందుకు కారణమని విశ్లేషించారు. 2016లో నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో వచ్చిన మొత్తం రూ.3,100 కోట్లయితే, ఇప్పుడు రూ.17,610 కోట్లకు చేరిందన్నారు. సిప్‌ ద్వారా మార్కెట్లోకి వస్తున్న మొత్తం ఏటా 24% పెరుగుతోందన్నారు.

2027కు రూ.లక్ష కోట్లకు చేరతాం: ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి మొత్తం 38 పథకాలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో అధిక శాతం ఈక్విటీ ఆధారిత పథకాలేనని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ ఏయూఎం రూ.16,526 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.30వేల కోట్లుగా ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.50వేల కోట్లకు, 2027 ఏప్రిల్‌ నాటికి రూ.లక్ష కోట్ల ఏయూఎం స్థాయికి చేరుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ రంగాల్లో మా పెట్టుబడులు: పీఎస్‌యూలు, బ్యాంకింగ్‌తో పాటు ఆర్థిక సేవలు, రక్షణ, ఐటీ, తయారీ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఝా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంఎఫ్‌లలోకి మొత్తం పెట్టుబడులు రూ.1.43 లక్షల కోట్ల మేరకు ఉన్నట్లు యాంఫీ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచే రూ.లక్ష కోట్ల ఏయూఎం ఉందని, దేశంలో ఇది ఎనిమిదో స్థానమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు