వెండిపై ఆచితూచి!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది.

Published : 29 Apr 2024 02:08 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.70,369 కంటే దిగువన కదలాడితే రూ.69,804; రూ.69,239 వరకు పడిపోవచ్చు. రూ.71,465 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు.


వెండి

వెండి జూన్‌ కాంట్రాక్టు రూ.84,328 కంటే పైకి వెళితే రూ.86,160 వరకు వెళ్లొచ్చు. అయితే ప్రతికూల ధోరణిలో కదలాడితే    రూ.80,832 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.79,168కు దిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోతాదుకు మించి పెరిగినట్లు కనిపిస్తున్నందున ఆచితూచి ట్రేడ్‌ చేయటం మంచిది.


ప్రాథమిక లోహాలు

  • రాగి మే కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.868.55 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.879.15 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.841.15 కంటే దిగువన కదలాడితే రూ.824.45 వరకు దిద్దుబాటు కావచ్చు.
  • సీసం మే కాంట్రాక్టు రూ.194 కంటే పైన చలించకుంటే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే రూ.196.75 వరకు పెరగొచ్చు.
  • జింక్‌ మే కాంట్రాక్టు రూ.246.15 కంటే దిగువన కదలాడితే మరింతగా పతనమవుతుంది. ఒకవేళ రూ.257.45 ఎగువన చలిస్తే రూ.262.55 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
  • అల్యూమినియం మే కాంట్రాక్టుకు రూ.231.95 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే    రూ.228.15కు పడిపోవచ్చు. ఒకవేళ      రూ.241.65 కంటే పైన కదలాడితే రూ.247.75 వరకు రాణించొచ్చు.

ఇంధన రంగం

  • ముడి చమురు మే కాంట్రాక్టుకు సానుకూల ధోరణి కొనసాగితే రూ.7,113 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.7,227; రూ.7,412 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.6,814 కంటే దిగువన కదలాడితే రూ.6,629; రూ.6,515 వరకు దిద్దుబాటు కావచ్చు.
  • సహజవాయువు మే కాంట్రాక్టు రూ.148 కంటే దిగువన చలించకుంటే.. మరింతగా రాణించొచ్చు. అయితే రూ.174 వద్ద నిరోధం ఎదురవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ రూ.148 కంటే కిందకు వస్తే రూ.140.35 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.120.15 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు జూన్‌ కాంట్రాక్టుకు రూ.18,108 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.17,187; రూ.16,154కు పడిపోవచ్చు. అదేవిధంగా సానుకూల ధోరణిలో కదలాడితే రూ.20,062 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.21,096 వరకు పెరగొచ్చు.
  • పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.57,960 కంటే కిందకు వస్తే రూ.57,580 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.58,960 స్థాయిని మించితే రూ.59,580 వరకు రాణించే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని