టెక్నాలజీ కంపెనీల్లో

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బంధన్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

Published : 12 Apr 2024 00:14 IST

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బంధన్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పూర్తిగా ఈక్విటీ పెట్టుబడులకే నిధులు కేటాయిస్తారు దీని ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ థీమ్యాటిక్‌ తరగతికి చెందిన పథకం. మనీష్‌ గున్వానీ, బ్రిజేష్‌ షా, రితిక బెహెరా ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీని దీని పనితీరుకు కొలమానంగా పరిగణనలోకి తీసుకుంటారు.


అన్ని విభాగాల షేర్లలో

ట్రస్ట్‌ ఎంఎఫ్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 19. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. మిహిర్‌ వోరా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ‘టెర్మినల్‌ వాల్యూ పెట్టుబడి విధానం’ ప్రకారం పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేస్తారు. వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకొని లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అన్నింటిలోనూ పెట్టుబడి పెట్టటం ఫ్లెక్సీ క్యాప్‌ పథకాల ప్రధాన వ్యూహం. ఇప్పటికే వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు 34 ఫ్లెక్సీ క్యాప్‌ పథకాలను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో మొత్తం రూ.3.49 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. గత మూడేళ్లలో సగటున 18.7 శాతం ప్రతిఫలం ఈ పథకాల నుంచి లభించింది.


ఒకేసారి 6 పథకాలు

టాటా మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి 6 పథకాలు తీసుకొచ్చింది. ఇవన్నీ ఇండెక్స్‌ పథకాలు కావటం గమనార్హం. టాటా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌, టాటా నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ ఫండ్‌, టాటా నిఫ్టీ మిడ్‌స్మాల్‌ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ ఫండ్‌, టాటా నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్‌ ఫండ్‌, టాటా నిఫ్టీ500 మల్టీక్యాప్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ 50: 30: 20 ఇండెక్స్‌ ఫండ్‌, టాటా నిఫ్టీ500 మల్టీక్యాప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ 50: 30: 20 ఇండెక్స్‌ ఫండ్‌... ఇందులో ఉన్నాయి. ఈ పథకాల ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 22న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. వేగంగా విస్తరిస్తున్న రంగాలను గుర్తించి, ఆయా రంగాల్లోని కంపెనీలపై పెట్టుబడి పెట్టి లాభపడే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ ఇండెక్స్‌ పథకాలు తీసుకొచ్చినట్లు టాటా మ్యూచువల్‌ ఫండ్‌ వివరించింది. ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉండటం వల్ల వినియోగం బాగా పెరుగుతోందని, ఏఏ రంగాల్లో వినియోగం పెరుగుతుందో గుర్తించి ఆయా రంగాలకు చెందిన పథకాలు ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఈ పథకాలకు ఫండ్‌ మేనేజర్‌ కపిల్‌ మీనన్‌. ఇండెక్స్‌ పథకాలు కాబట్టి ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. ఆ మేరకు మదుపరులకు మేలు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని