హెచ్చుతగ్గులు తక్కువగా...

ఇండెక్స్‌ తరగతికి చెందిన ఒక ఓపెన్‌ ఎండెడ్‌ పతకాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్‌ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు.

Published : 24 May 2024 00:42 IST

ఇండెక్స్‌ తరగతికి చెందిన ఒక ఓపెన్‌ ఎండెడ్‌ పతకాన్ని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా తీసుకొచ్చింది. కోటక్‌ నిఫ్టీ 100 లోవోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓలో ఈ నెల 31 వరకూ మదుపు చేయొచ్చు. కనీస పెట్టుబడి రూ.100. నిఫ్టీ 100 సూచీలో 100 అగ్రశ్రేణి కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ లార్జ్‌క్యాప్‌ తరగతికి చెందినవే. లిక్విడిటీ ఎంతో అధికంగా ఉంటుంది. ఇందులో 30 కంపెనీలను ఎంచుకొని పెట్టుబడి పెట్టటం ఈ పథకం ప్రధాన వ్యూహం. ముఖ్యంగా హెచ్చుతగ్గులు తక్కువగా ఉండే కంపెనీలను ఎంపిక చేస్తారు. క్రమానుగత పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తూ పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. పెట్టుబడి నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. నిర్దేశించుకున్న నిబంధనలకు వెలుపల ఉంటే కంపెనీలను పెట్టుబడి కోసం పరిశీలించే అవకాశం ఉండదు. ఈ పథకానికి దేవేందర్‌ సింఘాల్, సతీష్‌ దొండపాటి, అభిషేక్‌ బైసన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఇండెక్స్‌ ఫండ్‌ కాబట్టి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక మదుపరులకు అనువుగా ఉండే పథకం ఇది. ప్రధానంగా పెద్ద కంపెనీల్లో పెట్టుబడి పెట్టటం, హెచ్చుతగ్గులు తక్కువగా ఉండటం... వంటి సానుకూలతను పరిగణనలోకి తీసుకుంటే ఈ పథకంలో పెట్టుబడిపై తక్కువ రిస్కు, స్థిరమైన లాభాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని