E-Vehicle Policy: ఈవీ పాలసీకి కేంద్రం ఆమోదం.. టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం!

E-Vehicle Policy: ఈవీ పాలసీకి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఎన్నాళ్లనుంచో దేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న టెస్లాకు మార్గం సుగమమైంది.

Published : 15 Mar 2024 15:52 IST

E-Vehicle Policy | దిల్లీ: దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు గానూ కేంద్రం ఇ-వెహికల్‌ పాలసీని (E-Vehicle Policy) తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశం ఈవీల తయారీకి గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. దేశంలోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమమైంది.

కొత్త ఈవీ పాలసీ ప్రకారం.. ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు (5 వేల మిలియన్‌ డాలర్లు) దేశంలో పెట్టుబడిగా పెడితే.. పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్తతరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్‌ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. పైగా పర్యావరణానికి    మేలు జరుగుతుందని, క్రూడాయిల్‌ దిగుమతులు తగ్గి తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని తెలిపింది.

వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు

టెస్లా ఎంట్రీకి ఓకే!

దేశంలోకి ప్రవేశించాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టెస్లాకు దేశీయంగా తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ పాలసీ వీలు కల్పిస్తోంది. దీనికింద 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. దీంతో పాటు తయారీకి వినియోగించే విడి భాగాల్లో 25 శాతం స్థానికంగానే సమీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు 35 వేల డాలర్ల కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో ఏటా 8 వేల ఈవీల కార్ల వరకు దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు వర్తిస్తున్నాయి. ఇది టెస్లా ఎంట్రీకి అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పటినుంచో కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని