Hero MotoCorp: హీరో ధరల షాక్‌.. మరోసారి వాహన రేట్లు పెంపు!

Hero MotoCorp Price hike: హీరో మోటోకార్ప్‌ మరోసారి తన వాహన ధరలను పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

Updated : 22 Mar 2023 18:40 IST

Hero MotoCorp Price hike | దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటాకార్ప్ (Hero MotoCorp) వాహన కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. ఏప్రిల్‌ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్గార నిబంధనలు పాటించడంలో భాగంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హీరో మోటోకార్ప్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్‌షోరూమ్‌ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి మారనున్నాయి. మోడల్‌ను బట్టి, మార్కెట్‌ను బట్టి పెంపు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది.
Also Read: ఏప్రిల్‌ 1 నుంచి టాటా కమర్షియల్‌ వాహన ధరలు ప్రియం

బీఎస్‌-6 ఫేజ్‌-2 ఉద్గార ప్రమాణాలను పాటించడంలో భాగంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. గతేడాది డిసెంబర్‌లో కూడా హీరో తన వాహన ధరలను పెంచింది. మరోవైపు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలకు అనుగుణంగా ఇతర కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు తమ వాహనాల్లో మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆన్‌ బోర్డ్‌ డయాగ్నొస్టిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డివైజ్‌తో ఎప్పటికప్పుడు ఎంతెంత ఉద్గారాలు విడుదల అవుతున్నాయో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌ సైతం తాజాగా తన కమర్షియల్‌ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని