Indian Railways: ట్రైన్‌ టికెట్‌ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!

train ticket lost: ట్రైన్‌ టికెట్‌ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే..

Updated : 03 Mar 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు ప్రయాణం అంటేనే కొన్ని రోజుల ముందే రిజర్వేషన్‌ చేసుకుంటాం. టికెట్‌ను భద్రంగా దాచిపెట్టుకుంటాం. ఒకవేళ పొరపాటున టికెట్‌ పోతే.. ప్రయాణంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. రిజర్వేషన్‌ చేసుకున్నా జారీ చేసిన టికెట్‌ లేకపోతే.. టికెట్‌ లేని ప్రయాణికుడిగానే టీటీఈ పరిగణిస్తారు. ఒకవేళ మీకూ అలాంటి సందర్భం ఎదురైందా? అయితే, చింతించాల్సిన అవసరం లేదు. టికెట్‌ పోయినా, ఒకవేళ చిరిగిపోయినా భారతీయ రైల్వే (Indian Railways) అందుకు ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందిస్తోంది.

టికెట్‌ పోయిన సందర్భంలో ప్రయాణానికి ఇబ్బంది రాకుండా డూప్లికేట్‌ టికెట్‌ను (Duplicate ticket) పొందే వీలును భారతీయ రైల్వే కల్పిస్తోంది. అయితే ఇందుకోసం కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (PRS) కౌంటర్‌ వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేయాలి. అయితే, ఇక్కడ ఛార్ట్‌ ప్రిపేర్‌ అవ్వక ముందు, ఛార్ట్‌ ప్రిపేర్‌ అయిన తర్వాత ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

  • ఒకవేళ మీ టికెట్‌ కన్ఫర్మ్‌ అయి ఛార్ట్‌ ప్రిపేపర్‌ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్‌ను జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి క్లరికేజ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్‌ఏసీ టికెట్లు ఉన్న వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
  • ఒకవేళ ఛార్ట్‌ ప్రిపేపర్‌ అయ్యాక.. పోయిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌కు దరఖాస్తు చేస్తే మొత్తం ఫేర్‌లో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌ఏసీ టికెట్‌ కలిగిన వారికి ఈ సదుపాయం లేదు.
  • ఛార్ట్‌ ప్రిపేర్‌ అయ్యాక టికెట్‌ చిరిగిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌ కోసం ఆర్‌ఏసీ టికెట్‌ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ డూప్లికేట్‌ టికెట్‌ తీసుకున్న తర్వాత ఒరిజినల్‌ టికెట్‌ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పిస్తే 5 శాతం ఛార్జీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు