March 31 deadline: మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్‌!

March 31 deadline: మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది.

Updated : 28 Mar 2024 16:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? అయితే, రీకేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) చేయడం తప్పనిసరి. ఎవరైతే అధికారిక ధ్రువీకరణ పత్రాలతో గతంలో కేవైసీ (KYC) చేయలేదో వారంతా తిరిగి వివరాలు సమర్పించాలని ‘రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ (RTAs)’, కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (CAMS), కెఫిన్‌ టెక్‌.. ఫండ్‌ పంపిణీదారులకు సందేశాలు పంపుతున్నాయి. దీనికి 2024 మార్చి 31ని గడువుగా విధించాయి.

ఏయే పత్రాలు..

కేవైసీ/రీకేవైసీ (KYC) నిబంధనలు పూర్తి చేసేందుకు ఖాతాదారులు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణలు, ఆదాయం వివరాలు, ఫొటో, మొబైల్‌ నెంబరు అందించాలి. పాన్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అధికారిక పత్రాలుగా ఆర్‌టీఏలు పేర్కొన్నాయి. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. లేదంటే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించబోరు. రిడెమ్షన్‌లు సైతం ఆగిపోతాయి.

రీ-కేవైసీ చేయాలా? ఇలా చెక్‌ చేయండి..

  • https://www.cvlkra.com/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి
  • కేవైసీ ఎంక్వైరీపై క్లిక్‌ చేయాలి
  • పాన్‌ ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
  • సమర్పించిన ఐడీ ప్రూఫ్‌ల వివరాలు వస్తాయి

లేదా

  • మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థకు లేదా ఆర్‌టీఏ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి కేవైసీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

కేవైసీ ఎలా చేయాలి..

  • మ్యూచువల్‌ ఫండ్‌ లేదా ఆర్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి కేవైసీ ఫామ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
  • దాన్ని పూర్తి చేసి సంబంధిత పత్రాలను జతచేసి ఫండ్‌ హౌస్‌కు సమర్పించాలి
  • కేవైసీ ప్రక్రియ పూర్తి కావడానికి 21 రోజులు పడుతుంది
  • పాన్‌తో అనుసంధానమైన అన్ని మ్యూచువల్‌ ఫండ్‌లకు కేవైసీ మ్యాప్‌ అవుతుంది
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని