Price Hike: జనవరి నుంచి మారుతీ, ఆడీ కార్ల ధరల పెంపు

Maruti suzuki audi cars hike: ముడి సరకు, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ, ఆడీ ఇండియా ప్రకటించాయి.

Updated : 27 Nov 2023 15:19 IST

Price hike | దిల్లీ: దేశంలో కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki), జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల కంపెనీ ఆడీ ఇండియా (Audi India) తమ కార్ల ధరలను పెంచనున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.

ద్రవ్యోల్బణం, ముడి సరకు ధరలు పెరగడంతో ధరలు కార్ల ధరలు పెంచనున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. జనవరి నుంచి ఈ ధరల పెంపు వర్తిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ తెలిపింది. ఎంత శాతం పెంచేదీ వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల ధరల శ్రేణిలో ఆల్టో నుంచి ఇన్‌విక్టో వరకు వివిధ మోడళ్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది.

రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్‌ 12 లుక్‌ లీక్‌

జనవరి నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు ఆడీ తెలిపింది. జనవరి 1 నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సంస్థతో పాటు తమ డీలర్ల మనుగడ కోసం పెంపు తప్పలేదని ఆడీ ఇండియా అధిపతి బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు. పెంపు ప్రభావం కస్టమర్లపై వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తామన్నారు. భారత్‌లో క్యూ3 ఎస్‌యూవీ నుంచి ఆర్‌ఎస్‌క్యూ8 వరకు ఆడీ పలు రకాల కార్లను విక్రయిస్తోంది. ధరల శ్రేణి రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని