స్విఫ్ట్‌, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ

Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్‌ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది.

Updated : 10 Apr 2024 18:15 IST

Maruti Suzuki | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కార్ల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. స్విఫ్ట్‌తో పాటు ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో ఎంపిక చేసిన వేరియంట్‌ వాహన ధరల్ని పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు ఈ రోజు (ఏప్రిల్‌10) నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  

భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. రిలయన్స్‌తో మస్క్‌ చర్చలు?

స్విఫ్ట్ వాహన ధరను రూ.25,000, ఇక గ్రాండ్‌ విటారాలో సిగ్మా వేరియంట్‌ ధరను రూ.19,000 పెంచినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. పెంపు అనంతరం స్విఫ్ట్‌ ధరల శ్రేణి రూ.5.99 లక్షల నుంచి రూ.8.89 లక్షల (ఎక్స్‌షోరూం- దిల్లీ) మధ్య ఉంటే.. గ్రాండ్‌ విటారాలో సిగ్మా వేరియంట్‌ రూ.10.8 లక్షలుగా (ఎక్స్‌షోరూం- దిల్లీ) ఉంది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో అన్ని మోడల్‌ కార్ల ధరలపై 0.45 శాతం పెంపును మారుతీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు