Ola Electric: ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్‌.. ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌లో ఈ ఫీచర్లతో!

Ola Electric: ఓలా మరో స్కూటర్‌ తీసుకురాబోతోంది. ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌లో అప్‌డేట్‌ చేసిన వెర్షన్‌ వస్తోంది.

Published : 12 Apr 2024 13:45 IST

Ola Electric | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric).. మరో కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతోంది. తన ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌లో అప్‌డేట్ చేసిన విద్యుత్‌ స్కూటర్‌ రాబోతోంది. గతంలో తీసుకొచ్చిన ఎస్‌1 ప్రో, ఎయిర్‌ మోడళ్లలో ఉన్న స్పెషల్‌ ఫీచర్లు అన్నీ కలిపి కొత్త స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఫిజికల్‌ కీ కూడా ఉండనుందని ఆయన ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ 15న ఈ స్కూటర్‌ లాంచ్‌ కానుంది.

విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర

ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ సిరీస్‌లో ఎస్‌1 ఎక్స్‌, ఎస్‌ 1 ఎక్స్‌+ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 2, 3, 4 kWh బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తున్నాయి. దీని ప్రారంభ ధర అప్పట్లో రూ.80వేలుగా నిర్ణయించింది. కొత్తగా తీసుకురాబోయే స్కూటర్‌ను సైతం తక్కువ ధరలో తీసుకొస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, ఫేమ్‌-2 సబ్సిడీ ముగిసిన నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గరిష్ఠంగా సబ్సిడీ మొత్తం రూ.10వేలు మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త స్కూటర్‌ ధరను ఓలా ఎలక్ట్రిక్‌ ఎంత నిర్ణయించబోతోందో చూడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని