Ola electric: ధరలు తగ్గించిన ఓలా.. ఎస్‌1X ఇక రూ.69,999 నుంచే!

ఓలా తన ఎస్‌1 ఎక్స్‌ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి.

Published : 15 Apr 2024 16:29 IST

Ola electric | ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola electric) తన ఎంట్రీ లెవెల్‌ స్కూటర్లయిన ఎస్‌1 ఎక్స్‌ (S1 X) సిరీస్‌ ధరలను తగ్గించింది. వీటి ధరలు ఇకపై రూ.69,999 (ఎక్స్‌ షోరూమ్‌) నుంచే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త ధరలను కంపెనీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తొలిసారి విద్యుత్‌ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తక్కువ ధరలకే స్కూటర్లను అందుబాటులో ఉంచినట్లు ఓలా తెలిపింది. వచ్చే వారం నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని పేర్కొంది.

కొత్త ఎస్‌1 ఎక్స్‌ మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 2 kWh వేరియంట్‌ ధర రూ.69,999 (ప్రారంభ ఆఫర్‌), 3 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.84,999, 4 kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్లు 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తున్నాయని కంపెనీ తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఎస్‌1 ఎక్స్‌ స్కూటర్లు ఫిజికల్‌ కీ ఇస్తున్నారు. ఇందులో 2 kWh స్కూటర్‌ ఐడీసీ రేంజ్‌ 95 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 3 kWh స్కూటర్‌ 143 కిలోమీటర్లు, 4 kWh 190 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 

మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో రియల్‌మీ P సిరీస్‌ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!

ఎస్‌ 1ఎక్స్‌ స్కూటర్లలో 6kW మోటార్‌ ఉంటుంది. 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 2 కిలోవాట్‌ బ్యాటరీ వేరియంట్‌ టాప్‌ స్పీడ్‌ 85 కిలోమీటర్లు కాగా.. మిగిలిన రెండు స్కూటర్లు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్స్‌ ఉంటాయి. క్రూయిజ్‌ కంట్రోల్‌, రివర్స్‌మోడ్‌, ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌తో కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఏడు రంగుల్లో ఈ స్కూటర్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈసందర్భంగా సరికొత్త మైలురాయిని అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత రెండున్నరేళ్లలో మొత్తం 5 లక్షల వాహన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని